- Advertisement -
మన తెలంగాణ/బషీరాబాద్: బషీరాబాద్ మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అనీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఖాలీగా ఉన్న టీజీటీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం మరియు పీజీటీలో ఫిజికల్ సైన్స్, రసాయన శాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాలీగా ఉన్నట్లు తెలిపారు. టీజీటీకి బిఏడ్ మరియు టెట్ అర్హత కలిగి ఉండాలని, పీజీటీకి గాను పీజీ, బిఏడ్ మరియు టెట్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. అర్హత కల్గిన అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
- Advertisement -