- Advertisement -
ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -