- Advertisement -
అమరావతి: ఎపిలో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, వృద్ధులను దత్తత తీసుకున్నానని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmla Ramanaidu) తెలిపారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మతో కలిసి దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతినెలా 10 కిలోల బియ్యం, దుస్తులు, వైద్య సదుపాయం అందించనున్నామని అన్నారు. దివ్యాంగులకు టిడిపి ఫించన్లు (TDP pensions) పెరిగాయని, దివ్యాంగులకు పింఛన్లు రూ. వేల నుంచి రూ. 6 వేలకు పెంచాం అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -