Thursday, September 4, 2025

ఆఫ్ఘనిస్థాన్‌లో 2200కు పెరిగిన భూకంప మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

ఆఫ్ఘనిస్థాన్‌లో గత వారం సంభవించిన భూకంపం కారణంగా విధ్వంసం అయిన భవనాల నుంచి వందలాది మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 2200కు పైగా చేరిందని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి గురువారం తెలిపారు. ఆదివారం రాత్రి పర్వత ప్రాంతాలు, తూర్పు మారుమూల ప్రాంతాలలోని అనేక ప్రాంతాలను 6.0 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. దీంతో అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి, శిథిలాల కింద జనాలు చిక్కుకున్నారు. కన్నూర్‌లో ఎక్కువ మరణాలు సంభవించాయి. అక్కడ జనాలు పర్వతాలతో లోతైన నదీ లోయలలో నివసిస్తుంటారు. భూకంప బాధితుల కోసం గుడారాలు వేశాము. ప్రాథమిక, అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్నాము’ అని కూడా తెలిపారు. తాలిబాన్లు 2021లో అధికారం చేజిక్కించుకున్నాక ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం వచ్చిన భూకంపం అతిపెద్ద మూడో విధ్వంసకర భూకంపం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News