Wednesday, September 3, 2025

ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భరీ భూకంపం..

- Advertisement -
- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఆఫ్ఘాన్ లో మంగళవారం సాయంత్రం భూ ప్రకంపనలు సంభించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూమి కంపించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. యుఎస్‌జిఎస్ ప్రకారం, నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్లు (21 మైళ్ళు) దూరంలో భూకంప కేంద్రం ఉంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతాలలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 1,400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే తాజాగా మరో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇక, తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం మాట్లాడుతూ.. కునార్ ప్రావిన్స్‌లో మాత్రమే 1,411 మంది మరణించారని.. 3,124 మంది గాయపడ్డారని నిర్ధారించారు. నంగర్హార్‌లో మరో 12 మంది మరణించారని.. వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. కునార్‌లో 5,400కు పైగా ఇళ్లు నేలమట్టం కాగా.. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ  బృందాలు సోమవారం రాత్రంతా, మంగళవారం వరకు సహాయక చర్యలు కొనసాగించాయని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News