అబుదాబీ: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియాకప్-2025 (Asia Cup) గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్, హాంగ్‌కాంగ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఆసియాకప్ కంటే ముందు ఆఫ్ఘానిస్థాన్.. పాకిస్థాన్, యుఎఇలతో ముక్కోణపు సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చిన అఫ్ఘానిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గుల్దదిన్ నైబ్ ఆఫ్ఘాన్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. ఆ తర్వాత తమకు కూడా తొలుత బౌలింగ్ చేయాలని అనుకున్నామని హాంగ్‌కాంగ్ కెప్టెన్ యాసిం ముర్తజా అన్నాడు. యువ కల్హాన్ చాల్లు ఈ పెద్ద వేదికపై ఎలా ఆడుతాడో చూడాలని ఉందని కెప్టెన్ యాసిం అన్నాడు.
Also Read : మెగా టోర్నీకి సర్వం సిద్ధం.. నేటి నుంచి ఆసియా కప్