మన తెలంగాణ/ బల్మూరు: ఎస్‌సి, ఎస్టి మహిళా చిన్న, సన్నకారు రైతులకు 50శాతం సబ్సిడిపై, పెద్దకారు రైతులకు 40శాత సబ్సిడిపై వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుందని ఏఓ నరేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం చేస్తూ, ఇప్పటి వరకు యాత్రియాకరణలో లబ్ధి పొందని రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
బ్యాటరీ/చేతి పంపులు 185, పవర్ ఆపరేటెడ్ స్ప్రయేర్స్ 29, రోటవేటర్స్ 8, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 1, కల్టివేటర్/కేజ్ వీల్స్ 11, బండ్ ఫార్మర్ ఒకటి, పవర్ వీడర్ 1, బ్రష్ కట్టర్ 2, పవర్ టెల్లర్ 1 తదితర మొత్తం 242 పరికరాలు ఉన్నట్లు తెలిపారు. రోటవేటర్స్/కల్టివేటర్స్/ఎంబి ప్లగ్/ కేజ్ వీల్స్ కావాల్సిన రైతులు ట్రాక్టర్ ఆర్‌సి రైతు పేరున తప్పనిసరిగా ఉండాలన్నారు. అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్‌సి ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, లబ్ధిదారుల ఎంపిక తరువాత సంబంధిత పరికరం సరఫరా చేసే కంపెని పేరున డిడి తీయాల్సి ఉంటుందని, మరిన్ని వివరాలకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.