- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలోనే మోడల్ మార్కెటింగ్ గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రూ.150 కోట్లతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. మార్కెట్ చుట్టూ 6 గేట్లు ఏర్పాటు చేయాలని తుమ్మల అధికారులకు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (Khammam Agricultural Market) లో అన్ని వసతులూ ఏర్పాటు చేస్తున్నామని, సంక్రాంతి నాటికి మార్కెట్ పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. మార్కెట్ విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తామని, మార్కెట్ చుట్టూ ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండేలా చూస్తామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
- Advertisement -