Monday, September 8, 2025

ఓవైసీకి థ్యాంక్స్ చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఎంఐఎం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టు ఆయన తెలిపారు. సుదర్శన్ రెడ్డితో ఫోన్ మాట్లాడి అసదుద్దీన్ మద్దతు ప్రకటించారు. సహచర హైదరాబాదీ, న్యాయనిపుణులు సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఓవైసీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మద్దతుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని జస్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు అసదుద్దీన్ ఓవైసీకి ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Also Read: కవిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారించాలి: సిపిఐ నారాయణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News