Thursday, July 10, 2025

రాజస్థాన్ లో కుప్పకూలిన ఐఏఎఫ్ జాగ్వార్ జెట్..ఇద్దరు పైలట్ల మృతి,

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లోని చురు జిల్లాలో భానుడా గ్రామ సమీపంలో భారతవైమానిక దళానికి చెందిన జాగ్వార్ పైలెట్ జెట్ కూలి, ఇద్దరు పైలెట్లు మరణించారు. ఐదు నెలల్లో జాగ్వార్ యుద్ధ విమానాలు కూలిన మూడో సంఘటన ఇది. విమానం పంటపొలాల్లో కూలిపోవడంతో ధ్వంసమైంది. తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఇద్దరు పైలెట్ల మృతదేహాలను కనుగొన్నారు. బుధవారం మధ్యాహ్నం 1:32 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జాగ్వార్ ప్రమాదాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. రాజస్థాన్ లోని చురు సమీపంలో సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న ఐఏఎఫ్ జాగ్వార్ శిక్షణ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలిందని ఇద్దరు పైలట్లు మరణించారని, పౌర ఆస్తికి ఎలాంటి నష్టం కలుగలేదని ఐఏఎఫ్
తెలిపింది. ప్రమాద కారణాలను కనుగొనేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించింది.

ప్రమాదం వల్ల మరణించిన పైలట్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించింది. రాజస్థాన్ లో ఐఏఎఫ్ పలు వైమానిక స్థావరాలను నిర్వహిస్తోంది. జోధ్ పూర్, బికనీర్ లో ప్రధాన స్థావరాలు ఉన్నాయి. పంటపొలాల్లో జాగ్వార్ పైలెట్ జెట్ పెద్ద శబ్దంతో కుప్ప కూలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వారే పరుగుపరుగున ప్రమాద స్థలానికి వచ్చి మంటలను ఆర్పేయత్నం చేశారు.ఐదు నెలల్లో కుప్పకూలిన ఐదో జాగ్వార్ జెట్ ఇది. మార్చ్ 7న అంబాలాలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యతో జాగ్వార్ కూలిపోయింది. పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఏప్రిల్ 2న గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో జాగ్వార్ ట్విన్- సీటర్ ట్రైనర్ విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లలో ఒకరు చనిపోగా,మరొకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఐఏఎఫ్ ఐదు ప్రమాదాలను చూసింది.

మొదట ఫిబ్రవరి 6న గ్వాలియర్ నుంచి బయలుదేరిన మీరజ్ 2000 విమానం మధ్యప్రదేశ్ శివపురి సమీపంలో కూలిపోయింది. ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. మార్చ్ 7న అంబాలా జాగ్వార్ ప్రమాదం జరిగిన రోజునే, తూర్పు సెక్టార్ లోని బాగ్డోగ్రా ఎయిర్ బేస్ వద్ద ఏఎన్- 32 కార్గో విమానం ప్రమాదానికి గురైంది. తరచు విమాన ప్రమాదాల ఆందోళన కలిగిస్తున్నాయి.2017-2022 మధ్య 20 యుద్ధవిమానాలు కూలిపోయాయని, ఏడు హెలికాప్టర్లు, ఆరు శిక్షణ
విమానాలు ఒక రవాణా విమానం కూలిపోయిందని గత డిసెంబర్ లో పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News