- Advertisement -
విశాఖపట్నం: ఈ మధ్యకాలంలో పలు విమానాలు పెను ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటున్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే విమాన రెక్కలలో ఓ పక్షి ఇరుక్కుపోయింది. పక్షి ఇరుక్కోవడంతో విమాన ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బ తిన్నాయి. ఇది గమనించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. దీంతో విమానం పెసు ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎయిరిండియా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి గమ్యస్థానానికి చేరుస్తుంది.
Also Read : రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా?: పేర్నినాని
- Advertisement -