Thursday, September 18, 2025

బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుందనే విషయం కలకలం రేపుతున్నది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఓ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి రన్ వే నుంచి పక్కకు ఒరిగి పోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ముందు చక్రం వంగిపోవడంతో రన్ వే ను చీల్చుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. దీంతో రన్ వే దెబ్బతిన్నది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.

కాగా ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. పాడైన రన్ వే ను ప్రస్తుతం అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో బేగంపేట విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నట్లు సమాచారం. సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు ముందు ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. కాగా దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News