- Advertisement -
భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష లద్దాఖ్‌లో విజయవంతమైందని భారత రక్షణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో గగనతల లక్షాలను ఛేదించింది. గగనంలో వేగంగా భిన్న దిశల్లో కదిలే రెండు లక్షాలను ఆకాశ్ ప్రైమ్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించి చెప్పుకోదగిన మైలురాయిని సాధించిందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.
- Advertisement -