Sunday, August 3, 2025

IND vs ENG: ఆకాష్ దీప్ అరుదైన ఘనత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్ ఆకాష్ దీప్ అరుదైన ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడి పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన ఆకాశ్ అద్భుతమైన అర్ధశతకంతో రాణించాడు. నైట్‌వాచ్‌మన్‌గా బరిలోకి దిగిన ఆకాష్..మూడవ రోజు 71 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో ఆకాశ్ 14 ఏళ్ల రికార్డును నెలకొల్పాడు. 2000 సంవత్సరం తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అర్ధశతకం సాధించిన రెండవ భారతీయ నైట్‌వాచ్‌మన్‌గా ఆకాష్ నిలిచాడు. అమిత్ మిశ్రాతో కలిసి ఈ ఘనత అందుకున్నాడు. 2010లో చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌పై 50 పరుగులు, 2011లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 84 పరుగులు చేసి.. రెండుసార్లు ఈ ఘనత సాధించాడు మిశ్రా. కాగా, ప్రస్తుతం భారత్ 290 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో ధ్రువ్ జురెల్(34), రవీంద్ర జడేజా(35)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News