ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కి ముందు భారత్‌కు అనుకున్న విధంగానే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో గాయాల కారణంగా ముగ్గురు ఆటగాళ్లు దూరమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) ధృవీకరించినట్లు తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. బౌలర్లు అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్‌లో నాలుగో టెస్ట్‌లో ఆడటం లేదని గిల్ పేర్కొన్నాడట.
అయితే నితీశ్, ఆర్షదీప్‌లు అందుబాటులో ఉండరనే విషయంలో క్లారిటీ లేకున్నా.. ఆకాశ్‌దీప్ విషయంలో మాత్రం గిల్ స్పష్టత ఇచ్చాడు. ఆకాశ్‌దీప్‌కు ప్రత్యామ్నయంపై కూడా గిల్ (Shubman Gill) మాట్లాడాడట. అతని ప్లేస్‌లో అన్షుల్ కాంబోజ్ లేదా ప్రశిద్ధ్ కృష్ణను ఆడిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై మ్యాచ్ ప్రారంభం అయ్యే కొన్ని గంటల ముందు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక బ్యాటింగ్‌లో కరుణ్ నాయర్‌కు మరో అవకాశం ఇస్తున్నట్లు గిల్ చెప్పాడట. ఈ సిరీస్‌లో అతను మంచి ప్రదర్శన చేయనప్పటికీ.. తిరిగి ఫామ్‌ను పుంజుకుంటాడని గిల్ ధీమా వ్యక్తం చేశాడని సమాచారం.
ఇక రిషబ్ పంత్ కూడా శుభ్‌మాన్ గిల్ స్ఫష్టత ఇచ్చాడట. మూడో టెస్ట్‌లో గాయం కారణంగా పంత్ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అయితే నాలుగో టెస్ట్‌లో అతను బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని గిల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక మూడో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 90 సెకన్లు ఆలస్యంగా బరిలోకి దిగిందని, ఇలా చేయడం క్రీడాస్పూర్తికి విరుద్ధమని గిల్ ప్రస్తావించినట్లు సమాచారం.