ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత పేస్ బౌలర్ ఆకాశ్‌దీప్ (Akashdeep) మంచి ప్రదర్శన చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన అతడు.. ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్‌లో నైట్ వాచ్‌మెన్‌గా బ్యాటింగ్‌కి వచ్చి అర్థ శతకం సాధించాడు. అసలు విషయానికొస్తే.. దులిప్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈస్ట్ జోన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆకాశ్ దీప్ ఈ టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా అతడిని జట్టు నుంచి తప్పించి అస్సాంకు చెందిన పేసర్ ముక్తర్ హుసేన్‌ని జట్టులోకి తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆకాశ్‌దీప్ (Akashdeep) కూడా ఉన్నాడు. మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్‌లతో కలిసి అతడు బౌలింగ్ చేస్తాడని అంతా భావించారు. కానీ అనుకోకుండా అతన్ని జట్టు నుంచి తప్పించారు. పిటిఐ ప్రకారం ఆకాశ్‌దీప్ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఎ)లో విశ్రాంతి తీసుకోవాలి కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ సారథ్యం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ జట్టులో రియాన్ పరాజ్ చోటు దక్కించుకోగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.