Monday, July 7, 2025

ఇంత విషాదంలో కూడా.. అదిరిపోయే ప్రదర్శన చేసిన ఆకాశ్‌దీప్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పేసర్ ఆకాశ్‌దీప్ సింగ్ (Akashdeep) అదరగొట్టాడు. తన రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతను పది వికెట్లు తీశాడు. అయితే తన ఇంట విషాదం ఉన్నా కూడా అతను దేశం కోసం ఆడాడు. ఆకాశ్‌దీప్ బిసిఎ నుంచి బ్యాన్‌ని ఎదురుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే తన తండ్రి పక్షవాతంతో ప్రాణాలు వదిలేశారు. అది జరిగిన రెండు నెలలకే అతని సోదరుడు కూడా మృతి చెందాడు. ప్రస్తుతం అతడి సోదరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనని ఆకాశ్ తన సోదరి జ్యోతి సింగ్‌కు అంకితం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్.. తన ఆరోగ్య పరిస్థితి, ట్రీట్‌మెంట్‌తో పాటు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు ఆకాశ్‌తో మాట్లాడిన విషయాలను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తన సోదరుడు దేశం గర్వపడేలా ప్రదర్శన చేశాడని.. పది వికెట్లు తీయడం అద్భుతమని ఆమె కొనియాడారు. ‘‘ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో మేం కలుసుకున్నాం. అప్పుడు నా ఆరోగ్యం బాగుందని.. నా గురించి ఆందోళన వద్దని చెప్పాను. ప్రస్తుతం నేను మూడో స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. దీనికి కనీసం ఆరు నెలల ట్రీట్‌మెంట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఆకాశ్ వికెట్ తీసినప్పుడల్లా మేం ఎంతో సంతోషించాం. నా గురించి మీడియాతో చెబుతాడని అనుకోలేదు. ఎంతో భావోద్వేగానికి గురై అలా అంకితం చేశాడు. అతనికి మాపై ఉన్న ప్రేమ అలాంటిది. మ్యాచ్ ముగిసిన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. ‘కంగారు పడొద్దు దేశం మొత్తం మనకు అండగా ఉంది’ అని చెప్పాడు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా నాన్న, అన్నయ్య లేనప్పటికి ఆకాశ్ (Akashdeep) కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఇలాంటి సోదరుడు ఉండటం చాలా అదృష్టం’’ అని జ్యోతి సింగ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News