- Advertisement -
అఖండ చిత్రానికి సీక్వెల్గా అఖండ 2: తాండవంతో థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. అయితే, మూవీ మేకర్స్ అఖండ 2 నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు. ఈనెల 9న సాయంత్రం 6:03 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పనులు చకాచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఎం. తేజస్వి నందమూరి సమర్పణలో రామ్ అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్, ఆది పిన్ని శెట్టి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రామ్ ప్రసాద్, సంతోష్ డేటాకే చాయాగ్రహకులుగా వ్యవహరిస్తున్నారు.
- Advertisement -