Sunday, September 7, 2025

‘అఖండ2’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా గతం లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాను తొలుత సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, తాజా గా బాలకృష్ణ అఖండ2 చిత్ర రిలీజ్ డిసెంబర్ తొలివారంలో ఉంటుందని పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నెకస్ట్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య అఖండ2 హిందీ కోసం తన డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తన వాయిస్‌తో హిందీ ఆడియన్స్‌ను కూడా మెప్పించేందుకు బాలయ్య రెడీ అయ్యాడని వారు చెబుతున్నారు. సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News