బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కల్ట్ కామెడీ క్లాసిక్ ‘హేరా ఫేరీ‘. ఇటీవల ఈ సినిమా మూడవ భాగం షూటింగ్ ప్రారంభమైంది. అక్షయ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి నెట్టింట అనేక పుకార్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో బాబూరావు పాత్ర పోషించిన పరేష్ రావల్ కు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అయితే, మూడో భాగం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో పలు రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఆకస్మత్తుగా ఈ మూవీ నుంచి తప్పుకున్న పరేష్ రావల్ పై అక్షయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన నిర్మాణ సంస్థ.. పరేష్ రావల్ పై రూ.25 కోట్ల లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.
కాగా, ఈ మూవీ డైరెక్టర్ ప్రియదర్శన్ తోపాటు నిర్మాతతో తనకు ఎలాంటి విభేదాలు లేవని పరేష్ రావల్ వెల్లడించారు. అయితే, ఇంత పేరు తెచ్చిపెట్టిన సినిమా నుంచి పరేష్ రావల్ ఎందుకు తప్పుకున్నారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు.