Thursday, August 14, 2025

అలంపూర్ ఆర్‌డిఎస్ రైతుల చిరకాల కోరిక నెరవేరింది..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వడ్డేపల్లి: మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, అలంపూర్ ముద్దుబిడ్డ, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా. ఎస్‌ఏ సంపత్ కుమార్‌కు అలంపూర్ నియోజకవర్గ ప్రజల తరుపున జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ జిల్లా అధ్యక్షుడు ఎనుముల నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో తుమ్మిళ్ల లిప్టు కింద అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అలంపూర్ నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దశాబ్ధ కాలంలో ఆర్‌డిఎస్ రైతులు పడ్డ కష్టాలను చూసి చలించిన మాజీ ఎమ్మెల్యే కుమార్ గత ప్రభుత్వంపై పోరాటం చేసి ఆర్‌డిఎస్ రైతులతో భారీ ఎత్తున సింధనూర్ దగ్గర దీక్ష చ ఏసి అప్పుడు తుమ్మిల లిప్ట్ సాధించడం జరిగింది. ఇప్పుడు పట్టు వీడని విక్రమార్కుడిల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మల్లమ్మకుంట రిజర్వాయర్ అనుమతి ఇప్పించినందుకు సంపత్ కుమార్‌కి అలంపూర్ నియోజకవర్గం రుణపడి ఉంటుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News