Tuesday, May 20, 2025

సంభాల్ మసీదు సర్వే సబబే:అలహాబాద్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదు వ్యాజ్యం విషయంలో అలహాబాద్ హైకోర్టు సోమవారం స్పందించింది. అక్కడి షాహీ జమా మసీదు, హరిహర్ దేవాలయ వివాదంలో భూమి సర్వే జరపాలనే స్థానిక కోర్టు రూలింగ్‌ను హైకోర్టు సమర్థించింది. సర్వే ఆదేశాలను నిలిపివేయాలని మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. వ్యాజ్యం విచారణ కొనసాగుతుంది. కోర్టు కమిషనర్ నియామకం కూడా చెల్లనేరుతుందని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మసీదు కమిటీ , దేవాలయ తరఫు వాది హరిశంకర్ జైన్, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) సంబంధిత న్యాయవాదుల వాదనలు విన్న తరువాత రిజర్వ్ చేసి ఉంచిన తీర్పును హైకోర్టు ఇప్పుడు వెలువరించింది. ఇక్కడ వ్యవహారం అంతా సజావుగానే ఉంది. ఇక్కడ ఇప్పుడు సాగే ప్రార్థనా స్థలిని మార్చడం లేదు. అదే విధంగా ఏ కోణంలో కూడా ఇక్కడి పూజాదికాల వ్యవహారాలలో మార్పు చేయడం లేదు.

వాది ఈ విషయంలో ఇక్కడి కట్టడం సురక్షిత కట్టడం చట్టం పరిధిలోకి వచ్చినందున తమకు సరైన హక్కు కల్పించాలని వేడుకున్నారని ధర్మాసనం తెలిపింది. ఇంతకు మించి వేరే విషయం ఏదీ లేనందున కొత్తగా సర్వే ఆదేశాల రద్దు వంటి వాటిపై దాఖలు అయిన పిటిషన్లు చెల్లనేరవని తెలిపారు. 1958 చట్టంలోని సెక్షన్ 18 పరిధిలో 1920లో దీనిని సురక్షిత కట్టడాల పరిధిలోకి తీసుకువచ్చారని వివరించారు. కోర్టు నియుక్త కమిషనర్ ద్వారా ఈ ప్రాంతంలో సర్వేకు సంభాల్ కోర్టు వెలువరించిన ఆదేశాలను మజీదు కమిటీ హైకోర్టు సవాలు చేసింది. దిగువ కోర్టులో తమకు సరైన న్యాయం దక్కకపోవడంతో ఎగువ కోర్టుకు వెళ్లాల్సివచ్చిందని తెలిపారు. మసీదు కమిటీ వాదనలను అంగీకరించేందుకు కోర్టు తిరస్కరించింది. 1877లోనే సమస్య పరిష్కారం అయింది. తరువాత హైకోర్టు సంబంధిత డిక్రీని నిర్థారించిన విషయాన్ని హైకోర్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News