Thursday, May 8, 2025

బాలీవుడ్‌ స్టార్‌తో బన్నీ.. కాంబోలో సినిమా వచ్చేనా..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పుష్ప-2 సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా, అనంతరం పుష్ప-3 తదితర సినిమాలు చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ముంబైలో స్టార్ హీరో అమీర్‌ ఖాన్‌ని కలిశారు. ముంబైలోని అమీర్ నివాసంలో కొంత సమయం వీరిద్దరు కలిసి ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం అమీర్‌ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్టు మహా భారతం అని చెప్పారు. ఇది జరిగిన కొన్ని రోజులకే అల్లు అర్జున్.. అమీర్‌ని కలవడంతో బన్నీ ఈ ప్రాజెక్టులో నటిస్తాడా.. అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఇందుకోసం అల్లు అర్జున్ అట్లీలు లాస్ ఏంజెలెస్‌లోని ప్రముఖ విఎఫ్‌ఎక్స్ సంస్థను సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News