Friday, May 9, 2025

అట్లీతో మూవీలో హీరో, విలన్‌గా..?

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బ్లాక్‌బస్టర్ ‘పుష్ప -2’ మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ మూవీ నెవ్వర్ బిఫోర్ అనేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. పాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్.. హీరో, విలన్ రోల్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ పాత్రలను అట్లీ డిజైన్ చేసిన తీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కనుక విలన్ రోల్ డిజైనింగ్ ఊహించని రీతిలో ఉండనుందట. ఇక 2026లో సినిమా రిలీజ్ కానుందట. ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. రూ.500 కోట్లకు బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News