- Advertisement -
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు అందుకున్నారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పుష్ప-2′ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్నికైన అల్లుఅర్జున్ కు సిఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డును అందజేశారు. ఇక, ’35 చిన్న కథ కాదు’ సినిమాకు ఉత్తమ నటిగా నివేధ థామస్ గద్దర్ అవార్డు అందుకుంది. కాగా, ఈ అవార్డు వేడుకలో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
- Advertisement -