Sunday, June 15, 2025

దర్శకుడు సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు:అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును అందుకున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నాకు ఈ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డును అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కోమిటిరెడ్డి వెంకట రెడ్డికి ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు. ఐ లవ్ యూ సుకుమార్. ఈ అవార్డు నిజంగా సుకుమార్ విజన్. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ రాజమౌళికి చెప్పాలి. ఆయనే కనుక పుష్ప 1ను హిందీలో రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు.

రాజమౌళికి థ్యాంక్స్ చెప్పడానికి ఇలాంటి వేడుక కోసమే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డ్. ఎందుకంటే పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి, ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి ఏడాది ఈ వేడుక దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News