మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర భుత్వ ఆశయాలకు అనుగుణంగా డ్రగ్స్, గంజా యి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు దర్యాప్తు సం స్థలు నడుం బిగించాయి. ఇటీవలి కాలంలో రాష్ట్ర దర్యాప్తు, నిఘా సంస్థల ప్రతిష్ట మసకబారే విధం గా ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలు, ముఠాల పై ఈగల్, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌లతో పాటు పోలీసు బలగాలు సంయుక్తంగా ఆదివారం తనిఖీలు చేప ట్టాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 91 కిలలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రైళ్లలో గం జాయి సరఫరా చేస్తున్న నలుగురిని, రైలులో గం జాయి తరలి స్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట యిన నిందితుల వద్ద నుంచి 5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. వరంగల్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించ గా 32 కిలోల గంజాయి పట్టుబడింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ ఐనవోలు పరిధిలో 214 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, సరఫరాదారుడిని అదుపులోకి తీసుకు న్నారు. పట్టు బడ్డ గంజాయి విలువ 53.5 లక్షల అని పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయి పట్టుబడింది. ఇద్దరిని అరెస్టు చేశారు. దాని విలువ 7.5 లక్షలుగా అంచనా వేశారు.
ధూల్‌పేటలో రూ. 4 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
హైదరాబాద్ దూల్‌పేట్‌లోని దిల్వార్ గంజ్ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై ఎస్‌టిఎఫ్ బృందం దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో రూ. 4 లక్షల విలువైన 8.2 కేజీల గంజాయిని, గంజాయిని ప్యాక్ చేసే ప్రెసింగ్ మిషన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయిని దూల్‌పేట పోలీసులకు అప్పగించారు.
అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు
సంగారెడ్డిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టు రట్తైంది. 270 గ్రాముల అల్ఫ్రాజోలం, 7.89 కిలోల నోర్డాజీపమ్, రూ.16.31 లక్షల విలువైన డ్రగ్స్, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు గౌండ్ల శ్రీనివాస్‌గౌడ్, గౌండ్ల మల్లేశంలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయని పోలీసు సంస్థలు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద డిఆర్‌ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. లారీలో తరలిస్తుండగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. వీటిని ఎపిలోని కాకినాడ పోర్టు నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని చిరాగ్‌పల్లి పోలీసుస్టషన్‌కు తరలించారు.
Also REad: యూరియా కోసం క్యూలైన్‌లో సత్యవతి రాథోడ్