- Advertisement -
అమరావతి: ప్రజల సహకారం, కేంద్ర మద్దతు, పక్కా ప్రణాళికతో అమరావతిని నిర్మిస్తామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత్ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభం విజయవంతంపై ఎక్స్ లో సిఎం స్పందించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదకశక్తిగా నిలిచేలా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -