- Advertisement -
అమరావతి: వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ప్రపంచ కార్పొరేట్ కంపెనీలను విశాఖకు తెచ్చామని వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ( Gudiwada Amarnath) తెలిపారు. విశాఖ భూములను కారు చౌకగా తమ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో ఒక్క ఐటీ ఉద్యోగం(IT job Visakha) వచ్చిందా అని ప్రశ్నించారు. టిఎస్ సి ముసుగులో ఊరు పేరులోని ఉర్సాకు 60 ఎకరాలు, ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి రూ. 3 వేల కోట్ల భూమి కట్టబెట్టారని విమర్శించారు. విశాఖలో రూ. 3 వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టారని అమర్నాథ్ మండిపడ్డారు.
- Advertisement -