Thursday, July 31, 2025

కశ్మీర్‌లో భారీ వర్షాలు.. పహల్గాం, బల్తాల్ రూట్లలో అమర్‌నాథ్ యాత్ర రద్దు

- Advertisement -
- Advertisement -

కశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే పహల్గాం, బల్తాల్ రూట్లను బుధవారం అధికారులు రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్ము నుంచి యాత్రకు వెళ్లే మార్గాన్ని కూడా గురువారం రద్దు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున బల్తాల్, నున్వాన్/చందన్‌వారి స్థావర శిబిరాల నుంచి యాత్రను రద్దు చేయడమైందని , అలాగే భగవత్‌నగర్ నుంచి బల్తాల్, నున్వాన్ శిబిరాల నుంచి గురువారం కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు డిపిఆర్ డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News