- Advertisement -
అమెజాన్ డయాగ్నోస్టిక్స్‌ను అమెజాన్ ఇండియా ప్రారంభించింది. కస్టమర్లు ల్యాబ్ పరీక్షలు బుక్ చేయడానికి, అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయటానికి, ట్రాక్ చేయడానికి అమెజాన్ యాప్ నుండి వెంటనే డిజిటల్ రిపోర్ట్‌ను యాక్సెస్ చేయడానికి ఒక కొత్త డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రవేశపెట్టింది. అమెజాన్ డయాగ్నిస్టిక్స్‌తో 6 నగరాల్లోని 450 కి పైగా పిన్ కోడ్స్ కస్టమర్లు సులభంగా 800కి పైగా డయాగ్నోస్టిక్స్ పరీక్షలను బుక్ చేయవచ్చు. 60 నిముషాల లోగా ఇంటి వద్ద శ్యాంపిల్ సేకరణ, సాధారణ పరీక్షలు కోసం 6 గంటల లోపు డిజిటల్ రిపోర్ట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గూర్గావ్, నోయిడా, ముంబై వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
- Advertisement -