Tuesday, August 12, 2025

కొత్త ఫీచర్ తో డిజిటల్ గిఫ్ట్ కార్డ్స్ ను తీసుకొచ్చిన అమెజాన్ పే

- Advertisement -
- Advertisement -

తమ ఇ-గిఫ్ట్స్ కార్డ్స్ కోసం కొత్త వ్యక్తిగత ఫీచర్ తో భారతదేశంలో అమేజాన్ పే డిజిటల్ బహుమానాలను మారుస్తోంది. తమ సొంత వ్యక్తిగత ఫోటోలు లేదా ఆర్ట్ వర్క్ ను అప్ లోడింగ్ చేయడం ద్వారా గిఫ్ట్ కార్డ్స్ ను వ్యక్తిగతం చేయడానికి ఈ ఫీచర్ కస్టమర్లకు అనుమతిస్తుంది, అన్ని సందర్భాల కోసం సంబరాలను మరింత అర్థవంతం మరియు వ్యక్తిగతం చేస్తుంది ఆనందకరమైన అన్నా-చెల్లెళ్ల బంధాన్ని సంబరం చేయడానికి కస్టమర్లు సిద్ధంగా ఉండటం వలన, Amazon.in అన్ని పండగ అవసరాల కోసం ఏకైక వేదికగా రక్షా బంధన్ స్టోర్ ను పరిచయం చేసింది. అందంగా తయారు చేయబడిన రాఖీలు, సంప్రదాయబద్ధమైన మిఠాయిలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, మరియు ఇంకా ఎన్నో వాటిని ప్రదర్శిస్తున్న స్టోర్ షాపింగ్ ను సులభంగా మరియు ఆనందకరంగా చేయడానికి ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది.

ఇంకా, విలాసవంతమైన అనుభవాన్ని చేర్చే సొగసైన ఎన్వలప్స్, ప్రీమియం బాక్స్ లు, మరియు డిజైనర్ గ్రీటింగ్ కార్డ్స్ సహా కొత్త ప్యాకేజింగ్ రూపాలతో అమేజాన్ తమ వాస్తవమైన బహుమతి ఎంపికలను మెరుగుపరిచింది. ఈ రక్షా బంధన్ కు, పర్యావరణ చైతన్యం కలిగిన కస్టమర్లు విలక్షణమైన విత్తనాలు కలిగిన పేపర్ బహుమతి కార్డ్ ను ఎంచుకోవచ్చు. ఉపయోగించిన తరువాత ఈ కాగితాన్ని నాటవచ్చు. ఇది సుస్థిరమైన బహుమతి ప్రత్యామ్నాయాలకు Amazon.in నిబద్ధతను సూచిస్తోంది. ఇంకా, అమేజాన్ పే డిజిటల్ బహుమతులకు పండగ అందాన్ని తీసుకురావడానికి తమ యానిమేటెడ్ రక్షా బంధన్ ఇ-గిఫ్ట్స్ కార్డ్స్ కలక్షన్ ను కూడా విస్తరించింది.

కొత్త ఫీచర్ విడుదల గురించి మాట్లాడుతూ, నేహా గుప్తా మహాత్మ, డైరెక్టర్- స్టోర్డ్ వేల్యూ మరియు గిఫ్టింగ్, అమేజాన్ పే ఇలా అన్నారు, “భారతదేశంలో డిజిటల్ బహుమతులు కేవలం సౌకర్యం కంటే మరింత అర్థాన్ని కలిగి ఉండేలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని వ్యక్తిగత సంబంధంతో ఉద్వేగభరితంగా కలిపే అనుభవాలపై అమేజాన్ పేలో, మేము దృష్టి కేంద్రీకరించాము. అనుకూలమైన ఇమేజ్ ఉన్న గిఫ్ట్ కార్డ్స్ నుండి సుస్థిరమైన ఎంపికల వరకు మా కొత్త ఫీచర్లు, ప్రతి బహుమతి క్షణం సాధ్యమైనంత వరకు అర్థవంతంగా మరియు వ్యక్తిగతంగా చేయడానికి మా నిబద్ధతను సూచిస్తోంది.”

గిఫ్ట్ కార్డ్స్ రోజూవారీ బహుమతుల కోసం ప్రాధాన్యతనిచ్చిన ఎంపికగా అభివృద్ధి చెందింది, 1.34 బిలియన్ యూనిట్ల అమ్మకం మరియు కస్టమర్ కోసం ఖర్చు చేయడంలో 18% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధితో అమేజాన్ పే మైలురాయిని ప్రదర్శించింది. సగటు బహుమతి కార్డ్ విలువ సుమారు రూ. 3,500 విలువను కలిగి పెరిగిన వినియోగదారు ఆత్మవిశ్వాసాన్ని మరియు సందర్భాలు మరియు ప్రజల్లో విస్తృతమైన అనుసరణను సూచిస్తోంది. కస్టమర్ రిడంప్షన్ నమూనాలు ఈ కార్డ్స్ యొక్క విలక్షణతను చూపిస్తున్నాయి. వాస్తవమైన బహుమతి పరిష్కారంగా వాటి ఆకర్షణను శక్తివంతం చేస్తున్నాయి. Amazon.inలో 35%కి పైగా కొనుగోళ్లు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ మరియు గృహ శ్రేణుల్లో విస్తరించాయి.

కస్టమర్లు ఉత్తమమైన బహుమతి సరళతను పొందడాన్ని నిర్థారించడానికి Amazon.in మీ కోసం వివిధ శ్రేణుల్లో 300+ ప్రీమియం బ్రాండ్ గిఫ్ట్ కార్డ్స్ ను కూడా తెచ్చింది. ఇవి Amazon.inపై నిరంతరమైన కొనుగోలు ప్రక్రియ ద్వారా లభిస్తాయి. తనిష్క్ మరియు కల్యాణ్ జ్యువలర్స్ వంటి జ్యువలరీ బ్రాండ్స్ నుండి నుండి బిగ్ బాస్కెట్ నుండి ఇన్ స్టెంట్ గ్రాసరీ, జెప్టో మరియు జొమాటో మరియు ఎంటర్టైన్మెంట్ (బుక్ మై షో) మరియు ప్రయాణ అనుభవాలు (మేక్ మై ట్రిప్) వరకు తక్షణమే డిజిటల్ డెలివరీ చేసే సరైన బహుమతి వ్యవస్థను Amazon.in కలిగి ఉంది. ఈ బహుమతి కార్డ్స్ ను Amazon.in నుండి కొనవచ్చు మరియు నిర్దిష్టమైన బ్రాండ్ యాప్స్ లేదా స్టోర్స్ పై రెడీమ్ చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News