Tuesday, July 22, 2025

అమెజాన్ ప్రైమ్ డేలో నిమిషానికి 18 వేల ఆర్డర్లు

- Advertisement -
- Advertisement -

అమెజాన్ ఇండియా నిర్వహించిన ప్రైమ్ డే 2025 ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రైమ్ డే ఈవెంట్స్ కంటే భారీగా విజయవంతమైంది. మూడు రోజుల పాటు పెద్ద మొత్తంలో విక్రయాలు నమోదవగా, ఒక్క నిమిషంలో 18,000కు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా పట్టణాల కంటే చిన్న నగరాలు, గ్రామాల నుంచే 70 శాతం కొత్త ప్రైమ్ సభ్యులు నమోదయ్యారు. వేల కొద్ది ఉత్పత్తులు నాలుగు గంటలకే డెలివరీ కావడం గమనార్హం. చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు విస్తృతంగా పాల్గొని రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసుకున్నాయి. వినియోగదారులు అమెజాన్ పేట్ల ఆసక్తి చూపగా, 50% పైగా అమెజాన్ పే లేటర్ ద్వారా కొనుగోలు చేశారు. ప్రైమ్ వీడియోలో విడుదలైన పంచాయత్ 4, హెడ్స్ ఆఫ్ స్టేట్ వంటి బ్లాక్‌బస్టర్ కంటెంట్ దేశవ్యాప్తంగా 4,400 ప్రాంతాల్లో స్ట్రీమ్ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News