- Advertisement -
అమరావతి: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తెలిపారు. పులివెందుల అప్రజాస్వామ్య ఎన్నిక జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల పోలీసులు తీరు చాలా దారుణంగా ఉందని విమర్శించారు. రిగ్గింగ్ కు అడ్డుపడతాడనే అవినాష్ రెడ్డి ను నిర్భందించారని (Avinash Reddy arrested) జమ్మల మడుగు టిడిపి గుండాలు దొంగ ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సిపి శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధించారని, టిడిపి గూండాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ‘‘నా కొడకా కాల్చి పడేస్తా’’ అని డిఎస్పి అంటున్నారని చెప్పారు. వైఎస్ఆర్ సిపి ఆఫీసు గేట్లకు తాళాలు వేయడమేంటీ? అని ప్రశ్నించారు. కచ్చితంగా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.
- Advertisement -