- Advertisement -
అమరావతి: తనకు నిన్న సాయంత్రం బెయిల్ వచ్చిందని, నిన్నే విడుదల చేయాలని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కోర్టు ఆర్డర్స్ ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ….జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని చూశారని, ఎపి చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానాలంటే లెక్కలేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదని, లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ అంతా తప్పుల తడక అని విమర్శించారు. చంద్రబాబు చెప్పిననట్టు సిట్ అధికారులు నడుస్తున్నారని, లేని స్కామ్ ను సృష్టించిన వైసిపిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కక్షసాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Also Read : ధరలకు బ్రేక్.. కొనుగోళ్ల జోరు
- Advertisement -