- Advertisement -
అమరావతి: కూటమి సర్కార్ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయాలని కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు వెంట వెళ్తే తనపై అక్రమ కేసు పెట్టి వేధించాలని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అంబటి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు బెల్టు షాపులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో గల్లీ గల్లీకో బెల్టు షాపు (Galli Gallico Belt Shop) ఉందని తెలియజేశారు. కూటమి సర్కార్ అన్యాయాలు, దౌర్జన్యాలను ఎదుర్కొంటాం అని ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని దేనికైనా సిద్ధం అని సవాల్ విసిరారు. తమల్ని అణచివేయాలని చూస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు బుద్ధి చెప్తాం అని అంబటి రాంబాబు హెచ్చరించారు.
- Advertisement -