- Advertisement -
రాజకుమార, కెజిఎఫ్, సలార్, కాంతార వంటి మైల్ స్టోన్ చిత్రాలతో ప్రశంసలు పొందిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)ను రూపొందిస్తోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సోమవారం నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార చాప్టర్ 1 మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దాదాపు 250 రోజుల షూటింగ్, మూడు సంవత్సరాల కష్టం అంతా మిక్స్ అయిన ఈ వీడియో ఒక సినిమాటిక్ ఫెస్టివల్‌లా (cinematic festival) కనిపిస్తుంది. అక్టోబర్ 2న గ్లోబల్ రిలీజ్ కానున్న ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రానుంది.
- Advertisement -