హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా అలరించిన సూపర్ హీరో తేజ సజ్జా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’ (Mirai) తో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూలై 26న విడుదలయ్యే ఫస్ట్ సింగిల్ వైబ్ ఉందితో ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారం భం కానున్నాయి. టైటిల్, పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా ఓ హై ఎనర్జీ టెక్నో బీట్ సాంగ్ ఇదని అర్ధమవుతోంది. హీరోహీరోయిన్లు తేజ సజ్జా,- రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మనోజ్ మంచు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు.
శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. కార్తికేయ 2, జాట్ (Kartikeya 2 Jat)లాంటి హిట్స్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీగా నిర్మిస్తోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. 2డి, 3డి ఫార్మాట్లలో 8 భాషల్లో థియేటర్లలోకి వస్తుంది.