- Advertisement -
పారిస్: ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, విజ్ఞాన,సాంస్కృతిక సంస్థ యునెస్కో నుంచి మళ్లీ వైదొలగుతున్నట్టు అమెరికా మంగళవారం ప్రకటించింది. యునెస్కోలో తిరిగి చేరి రెండేళ్లయిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. యునెస్కో నుంచి వైదొలగుతుండడం ఇది మూడో సారి. గతంలో ట్రంప్ హయాంలో ఒకసారి యునెస్కో నుంచి వైదొలగడం జరగ్గా, బైడెన్ ప్రభుత్వ కాలంలో ఐదేళ్ల విరామం తరువాత తిరిగి చేరడమైంది. ఇప్పుడు వైదొలగాలన్న నిర్ణయం 2026 డిసెంబర్ నుంచి అమలులోకి వస్తుంది.
- Advertisement -