Saturday, September 6, 2025

రిటైర్‌మెంట్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ మిశ్రా

- Advertisement -
- Advertisement -

స్పిన్‌ బౌలర్ అమిత్ మిశ్రా (Amit Mishra) క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 43 ఏళ్ల మిశ్రా అన్ని స్థాయిల్లోనూ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 2003లో వన్డేల్లో అడగుపెట్టిన మిశ్రా సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి గుడ్ బై చెప్పారు. అయితే రిటైర్‌మెంట్ తర్వాత మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తను భారత్‌కు ఆడుతున్న సమయంలో సెలక్షన్ విధానం వేరేలా ఉండేదని ఆయన కామెంట్ చేశారు. తనకు టీం ఇండియాలో అవకాశాలు ఎందుకు తక్కువగా వచ్చేవనే విషయాన్ని బయటపెట్టారు. కొన్నిసార్లు జట్టులో ఉండటం.. మరికొన్ని సార్లు ఎంపిక కాకపోవడం.. ఇంకొన్నిసార్లు జట్టుకు ఎంపికైనా.. తుది జట్టుకు ఎంపిక కాకపోవడం వంటి విషయాలు ఓ ఆటగాడిని అన్నిటికంటే ఎక్కువగా నిరాశపరుస్తాయని అన్నారు.

తన విషయంలో కూడా ఇలాగే చాలాసార్లు జరిగిందని మిశ్రా (Amit Mishra) పేర్కొన్నారు. కెప్టెన్లకు కొంతమంది ఆటగాళ్లంటే ఇష్టం ఉంటుందని.. వాళ్లకు తరచుగా అవకాశాలు వస్తాయని అన్నారు. మనల్ని మనం నిరూపించుకుంటే.. అవకాశం అదే వస్తుందని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ‘‘ఒకవేళ సెలక్టర్లు నన్ను పరిగణలోకి తీసుకోలేదంటే.. ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఏ విషయంలో ఇంకా మెరుగవ్వాలనే మాత్రమే ఆలోచించే వాడిని. భారత జట్టుకు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా నన్ను నేను నిరూపించుకున్నాను. ఎల్లప్పుడు కఠిన శ్రమ, అంకితభావంతో ఆడ వాడిని’’ అని మిశ్రా వెల్లడించారు.

ధోనీ సారథ్యంలో తనకు జట్టులో అవకాశాలు రాకపోవడంపై మిశ్రా స్పందించారు. ‘‘జట్టు ఎంపిక విషయంలో చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. మనం మన ఆటపైనే దృష్టిపెట్టాలి. తుది జట్టును ఎంపిక విషయంలో కెప్టెన్ నిర్ణయం తీసుకుంటాడు. నాకు ధోనీతో మంచి అనుబంధం ఉంది. నన్ను ఎందుకు తీసుకోలేదని కొన్ని సందర్భాల్లో అడగాను. జట్టు కూర్పునకు అనుగుణంగానే నన్ను పక్కన పెట్టామని అతడు చెప్పాడు’’ అని మిశ్రా పేర్కొన్నారు.

Also Read : క్రికెట్‌కు అమిత్ మిశ్రా గుడ్‌బై

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News