- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిసి రిజర్వేషన్ల బిల్లు విషయాన్ని తాను పరిశీలిస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు హామీ ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటైన స్పీకర్ల సదస్సును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. తేనేటి విందు విరామం సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి బిసి రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి మీకు పంపించడం జరిగిందని చెప్పినట్లు సమాచారం. బిసి రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గతంలో మిమ్మల్ని కలిసి కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకు కేంద్ర మంత్రి అమిత్ షా స్పందిస్తూ తాను పరిశీలిస్తానని చెప్పినట్లు తెలిసింది.
- Advertisement -