Thursday, May 8, 2025

సరిహద్దు రాష్ట్రాల సిఎంలతో అమిత్‌ షా అత్యవసర సమీక్ష..

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత ఆర్మీ.. పాక్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది భారత పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ డాడులపై స్పందిస్తూ భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. సరిహద్దు రాష్ట్రాల సిఎంలతో అత్యవసర సమీక్ష చేపట్టారు. సరిహద్దు రాష్ట్రాల సిఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ సిఎంలు, లద్దాఖ్‌ ఎల్జీ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News