నక్సలిజం నిర్మూలనలో కీలక ముందడుగు సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం ఛత్తీస్‌గఢ్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా మాట్లాడుతూ.. 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు. నక్సలిజం ఉద్యమానికి వెన్నెముకలా నంబాల కేశవరావు ఉన్నారు. 30 ఏళ్ల పోరాటంలో ఇంతపెద్ద నాయకుడిని మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 54 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 84 మంది మావోయిస్టులు లొంగిపోయారు అని అమిత్ షా తెలిపారు.
ప్రధాని మోడీ కూడా ఈ ఎన్ కౌంట్ పై స్పందించారు. భద్రతాదళాల విజయం చూసి గర్వంగా ఉంది. మా ప్రభుత్వం ప్రజల శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. మావోయిజాన్ని తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నాం అని ఎక్స్ లో ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు 27 మంది మృతి చెందారు.