Thursday, September 4, 2025

వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాల్గొననున్న అమీత్ షా

- Advertisement -
- Advertisement -

భాగ్యనగరంలో అత్యంత వైభవంగా చారిత్రాత్మక వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమీత్ షా రానున్నారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం జరగనున్నది. ఈ నిమజ్జన ఊరేగింపులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు కోరడంతో కేంద్ర మంత్రి అమీత్ షా సుముఖత వ్యక్తం చేశారు. ఆ రోజున మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం మొజంజాహి మార్కెట్ వద్ద ఊరేగింపులో పాల్గొనే భక్తులనుద్ధేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News