Thursday, July 17, 2025

ఈ నెల చివరి వారంలో తెలంగాణకు అమిత్ షా

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల చివరి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా పాల్గొంటారని ఆయా వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్‌పర్సన్ పల్లె గంగారెడ్డిలు

ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన అమిత్‌షా తప్పకుండా విచ్చేస్తానని హామీ ఇచ్చినట్లు అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించే ఖచ్చితమైన తేదీని త్వరలోనే నిర్ణయించి తెలియజేస్తామని అమిత్‌షాకు తెలిపామని చెప్పారు. దేశంలోనే పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటు కావడం పసుపు పండించే రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News