- Advertisement -
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఫిక్స్ కాగా చివర్లో పర్యటన క్యాన్సిల్ అయ్యింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఎంపిలతో భేటీ కారణంగా అమిత్ షా హైదరాబాద్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం 2025, సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అమిత్ షా రాక నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు, అధికారులు, బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, సెప్టెంబర్ 9న జరగనున్న రాష్ట్రపతి ఎన్ని క సన్నాహాలు, ఎంపిలతో భేటీ కారణంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమిత్ షా పర్యటన రద్దు వెనక కారణం ఇదేనా లేక మరేదైనా ఉందా అనేది వెల్లడి కావాల్సి ఉంది.
- Advertisement -