తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్రశంసల వర్షం కురిపించారు. అభిషేక్ ఇటీవల ‘కాళీధర్ లాపతా’ అనే సినిమాలో నటించారు. తమిళ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన కరుపుదురై సినిమాకు ఇది రీమేక్. తాజాగా అమితాబ్ తన కుమారుడి వర్కింగ్ స్టైల్‌ను మెచ్చుకున్నారు. అభిషేక్ ఈ ఏడాదిలో ‘ఐ వాంట్ టు టాక్’, ‘హౌస్‌ఫుల్ 5’, ‘కాళీదధర్ లాపతా’ అనే సినిమాల్లో నటించాడు. ఆ పాత్రలు మూడు సినిమాల్లో అభిషేక్ తనకు స్క్రీన్‌పై కనిపించలేదని.. కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించిందన్నారు.
ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా మూడు విభిన్నమైన పాత్రలు పోషించాడని కొనయాడారు. ఈ రోజుల్లో అలా చేయడం చాలా ప్రత్యేకమని.. ఓ పాత్రను పూర్తిస్థాయిలో అంగీకరించి.. అద్భుతంగా యాక్టింగ్ చేసి.. నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు అని పేర్కొన్నారు. ఒక తండ్రిగా అభిషేక్‌ని ప్రశంసించకుండా ఉండలేక పోతున్నానని అమితాబ్ (Amitabh Bachchan) పోస్ట్ చేశారు.