పెద్ద పులులు, అరుదైన వన్య ప్రాణుల ఆరోగ్య భద్రతా, సంతానవృద్ధి, సంతానోత్పత్తి ప్రక్రియల దృష్టా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను మూడు నెలల పాటు రాష్ట్ర అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షాణ విభాగం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటకులను ఆకట్టుకునే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సందర్శకుల కోసం జంగిల్ ట్రిప్, వీక్షణ ప్రదేశాల వంటి సందర్శన ప్రాంతాలు జూను 30 వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా జాతీయ పెద్దపుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టిసిఎ) మార్గదర్శకాలకు అనుగుణంగా పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూపార్క్ డైరెక్టర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వూ ఫీల్డ్ డైరెక్టర్ , అటవీశాఖ అచ్చంపేట సర్కిల్ కన్జర్వేటర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమంత్ తెలిపారు.
ప్రతి ఏడాది వర్షాలంలో టైగర్ రిజర్వ్‌లో పెద్దపులు, ఇతర వన్యప్రాణులు వర్షాల కారణంగా తడిసిన నేలల్లో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తల్లో భాగంగా వాటికి ఇతరాత్ర అలికిడి ఉండని విధంగా సిబ్బందితో పాటు సందర్శకులను కజ్జర్వేషన్ జోన్‌లోకి అనుమతించరు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని ఫర్హాబాద్ వ్యూ పాయింట్, అక్టోపస్ వ్యూ పాయింట్లు మూసి వేస్తున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వెల్లడించారు. వన్యప్రాణుల పరిరక్షణ ప్రయత్నాలు సులభతరం చేయడంతో పాటు వ్యాధు వ్యాప్తిని నివారించేందు ఈ మూడు నెలల కాలం ఎంతో కీలకం. దాంతో టైగర్ రిజర్వ్‌లోకి పర్యాటకులను అనుమతించరు. పెద్ద పులుల సంతోనోత్పత్తి ప్లాన్ (టిసిపి) ప్రకారం పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణుల సంరక్షణ నిర్వహించడానికి టైగర్ జోన్ మూసివేత దోహదపడుతుంది.
ఈ అంశాన్ని పర్యాటకులు, వన్యప్రాణి ఔత్సాహికులు గ్రహించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. పర్యాటకులతోపాటు ఇతరులు ఎవరూ కూడా ఆంక్షలు అమలులో ఉన్న పెద్దపులుల సంరక్షణ ప్రదేశాల వద్ద నిబంధనలు ఉల్లగించి కనిపిస్తే సహించేది లేదని ఫీల్డ్ డైరెక్టర్ హ్చెరించారు. కాగా, వర్షా కాలంలో వన్యప్రాణులు సంతానోత్పత్తి చేసి పుట్టిన పిల్లలను సంరక్షించుకునేందు ప్రశాతం వాతావరణం కోరుకుంటాయి. పలు రకాల వన్యప్రాణులు సంతానోత్పత్తి ప్రక్రియకు ఆడ, మగ జంతువులు జత కట్టె అనుకూల కాలం కూడా ఈ మూడు నెలలలో అధికంగా ఉంటుంది. వేసవి కారణంగా ఎండిన అటవీ ప్రాంతం వర్షాలు కురుస్తుండడంతో తిరిగి సమతుల్యతను పెంచుకునే వీలు ఉంటుంది.