Sunday, September 7, 2025

స్తంభాన్ని ఢీకొట్టి తలకిందులైన కారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి స్తంభం దిమ్మెను ఢీకొట్టిన తలకిందులుగా ఉండిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జరిగింది. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంకు చెందిన ఓ దంపతులు తమ పిల్లలతో కలిసి కారులో విజయవాడకు వెళ్తున్నారు. ఒడ్డిమెట్ట గ్రామ శివారులో కారు అదుపుతప్పి రెయిలింగ్ ఢీకొట్టి అనంతరం స్తంభం దిమ్మెను గుద్దుకుంది. కారు ముందు భాగం స్తంభం దిమ్మెలో పిక్స్ కావడంతో వాహనం వెనక వైపు నుంచి పైకి లేచింది. ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో దంపతులు, పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్తంభం నుంచి కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. స్తంభం లేకపోతే ప్రమాద జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు డ్రైవింగ్ లో అనుభవం లేని వాహనం డ్రైవ్ చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారిపై కారులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ పెట్టుకోవాలని పోలీసులు సలహాలు ఇస్తున్నారు.

Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News