అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి ప్రవర్తన నచ్చక ఇద్దరు కూతుళ్ల వాళ్ల బాబాయ్‌తో కలిసి ఆమెను హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బంకెల సంతు(37) భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమార్తెలతో కుర్మానపాలెం వడ్లపూడి రాజీవ్‌నగర్‌లో (Anakapalli Kurmanapalem) నివాసం ఉంటుంది. పెద్ద కుమార్తె డిగ్రీ చదువుతుండగా.. చిన్న అమ్మాయి ఇంటరె్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే సంతు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు వృథా చేసేది. చాలాసార్లు ఈ విషయంపై సంతుకి ఆమె మరిది మురళీధర్, ఇద్దరు కుమార్తెల మధ్య గొడవలు జరిగేవి.
ఇటీవల చిన్న కుమార్తె తల్లి ఫోన్‌లో అసభ్యకర దృశ్యాలను చూసింది. దీంతో ఈ విషయాన్ని తన అక్కకు చెప్పింది. తల్లి ప్రవర్తనతో విసుగు చెందిన కుమార్తెలు తమ బాబాయ్ సాయంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14న ఇంట్లో (Anakapalli Kurmanapalem) నిద్రిస్తున్న తల్లిని హత్య చేసి మృతదేహాన్ని కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.
Also Read : చిన్నారి ప్రాణం తీసిన పురుగు